రాష్ట్రపతిని కలిసిన సీఈసీ

SMTV Desk 2019-05-25 16:24:10  president ram nath kovind, central election commission of india, sunil arora

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కేంద్ర ఎన్నికల ప్రధాన ఆధికారి సునీల్ ఆరోరా కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంట్ సభ్యుల జాబితాను రాష్ట్రపతికి అందించారు.కాగా మొత్తం 542 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 8040 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ స్థానానికి జరుగవలసిన ఎన్నికను ఈసీ రద్దు చేసింది.కాగా ఎన్డీయే 352 స్థానాలతో భారీ మెజారిటీ సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.