మేం ఏం చేయాలో..... చెప్ప‌డానికి మీరెవ‌రు?: జీవిత రాజశేఖర్

SMTV Desk 2019-05-25 16:21:35  jeevitha, naga babu

‘మా’ ఎన్నికల్లో నరేశ్ ప్యానెల్ విజయానికి ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబే కారణమంటూ వస్తున్న వార్తలను జీవిత ఖండించారు. నేడు జీవిత, రాజశేఖర్ దంపతులు జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవిత మాట్లాడుతూ....."మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) అనేది ఓ చిన్న కుటుంబం. అందులో 500-600 ఓట్లు ఉంటాయి. మా ఫ్యామిలీ అంద‌రం ఒకటే. నాగ‌బాబుగారు ఇంటింటికీ వెళ్లి ఓట్లేయ‌మ‌ని చెప్ప‌లేదు. ఓట్లేయించారా! కాదు క‌దా.. మేం క‌ష్ట‌ప‌డ్డాం. మేం అందరం క్యాంపెయిన్ చేసుకున్నాం.

నేను, రాజ‌శేఖ‌ర్‌, నా కూతుర్లు ఇద్ద‌రూ ప్ర‌తి మెంబ‌ర్‌కి ఫోన్ చేశాం. మేం మంచి చేస్తాం.. చేయ‌గ‌లం అని వాళ్లు న‌మ్మారు కాబ‌ట్టి మాకు న‌మ్మ‌కంతో ఓటేశారు. దీనికి నాగబాబుగారులాంటోళ్లు కూడా స‌పోర్ట్ చేశారు. నాగ‌బాబులాంటి వాళ్లు వీళ్ల‌లో జెన్యూనిటీ ఉందని ఆలోచించారు. వాళ్ల‌కే స‌పోర్ట్ చేద్దామ‌నుకున్నారు.

దాని వ‌ల్ల 1 శాతం మాకు క‌లిసొచ్చి ఉండొచ్చు కానీ.. కేవ‌లం నాగ‌బాబుగారు చెప్పార‌నే ఎవ‌రూ మాకు ఓటేయ‌లేదు. నాగ‌బాబుగారి స‌పోర్ట్ వ‌ల్ల‌నే గెలిచామ‌నేదంతా కూడా సోష‌ల్ మీడియా క్రియేష‌న్. మ‌ళ్లీ పొలిటిక‌ల్‌గా ఈ సోష‌ల్ మీడియానే మీకు అలా స‌పోర్ట్ చేసిన‌ప్పుడు మీరెలా వ్య‌తిరేకంగా వెళ‌తారని ప్ర‌శ్నించింది. నాకు అర్థం కానీ విష‌య‌మేమంటే.. అసలు ఎవరు? ఎవ‌రిని పోషిస్తున్నారు? ఎవ‌రి గురించి ఎవ‌రు భ‌య‌ప‌డాలి? మేం ఏం చేయాల‌నేది దాన్ని మీరు (సోష‌ల్ మీడియా) చెప్ప‌డానికి మీరెవ‌రు?" అన్నారు.