వైసీపీ-టీడీపీ మధ్య గొడవ......వైరల్ అవుతున్న వీడియో

SMTV Desk 2019-05-25 16:20:00  tdp, ycp

జిల్లాలోని శ్రీనివాసపురంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదే జిల్లా నరసరావుపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ‘డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు’ పేరుతో ఉన్న బోర్డులను గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తు లు ధ్వంసం చేశారు. ఆర్‌యూబీ, టౌన్‌హాల్‌ బోర్డులపై ఆ పేర్లను తొలగించారు. అలాగే స్టేడియంలో డాక్టర్‌ కోడెల చిత్రపటాన్ని ధ్వంసం చేశారు. అన్న క్యాంటీన్‌కు సంబంధించి బోర్డుపై ఉన్న ‘అన్న’ పేరును కూడా పగలగొట్టారు. వైసీపీకి చెందిన వ్యక్తులుగా భావిస్తున్న వారు ఈ ఘటనలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది.