కోహ్లీ ట్వీట్ కి బచ్చన్ రిప్లై...నెటిజన్ల కామెంట్లు

SMTV Desk 2019-05-25 16:14:57  abhieshek bachhan, virat kohli

టీంఇండియా కాప్టెన్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ట్రోల్ చేశాడు. వార్మప్ మ్యాచ్‌కు ప్రాక్టీస్‌లో భాగంగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో శుక్రవారం టీమిండియా ప్రాక్టీస్ చేసింది. స్వతహాగా ఫుట్‌బాల్ క్రీడాభిమాని అయిన కోహ్లీ ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ కెప్టెన్ హ్యారీ కేన్‌ను కలిశాడు.కోహ్లీతో కలిసి దిగిన సెల్ఫీని హ్యారీ కేన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేశాడు. రెండేళ్ల తర్వాత కోహ్లీని మళ్లీ కలిశాను. గ్రేట్ పర్సన్, బ్రిలియంట్ స్పోర్ట్స్‌మన్ అని ట్వీట్ చేశాడు. అదే ఫొటోను కోహ్లీ కూడా పోస్టు చేసి నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఫైనల్స్‌కు ఆల్ ద బెస్ట్ అని రాసుకొచ్చాడు.కోహ్లీ.. హ్యారీ కేన్‌ల పోస్టులు క్రీడాభిమానులతో పాటు బాలీవుడ్ యాక్టర్ అభిషేక్ బచ్చన్ కూడా స్పందించాడు. గతంలో కోహ్లీ ఫుట్‌బాల్ జెర్సీతో ఉన్న ఫొటోను పోస్టు చేసి స్మైలీలు ఉంచాడు. అభిషేక్ బచ్చన్ ఏ ఉద్దేశ్యంతో చేసినా కోహ్లీ అభిమానులు మాత్రం దారుణంగా ఆడుకుంటున్నారు.