చైనాలో పడవ మునిగి 10 మంది మృతి

SMTV Desk 2019-05-25 16:11:14  boat accident in china, Banrao village in southwest China

బీజింగ్‌: చైనా నైరుతి ప్రాంతంలోని ఓ నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదిలో ప్రయాణీకులతో ఉన్న బోటు నదిలో మినిగిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు అధికార మీడియా వెల్లడించింది. గిఝౌప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతంలో వున్న బన్రావ్‌ గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది జాడలు తెలియటంలేదని అధికార సిసిటీవీ తన వార్తా కథనాలలో వెల్లడించింది. సహాయక బృందాలు 11 మందిని ఒడ్డుకు చేర్చాయని, అందులో బోటు కెప్టెన్‌కూడా వున్నారని మీడియా వెల్లడించింది. బోట్‌ కెప్టెన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.