ఏపీలో జనసేన ఓటమిని ఎంజాయ్ చేస్తున్న వారిలో పవన్ అభిమానులు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. పవన్ రాజకీయాల్లోకి వెళ్తాను అన్నప్పుడు వద్దని చెప్పిన అభిమానులు ఉన్నారు. ఆయన్ని హీరోగా, పవర్ స్టార్ గా ఇష్టపడే అభిమానులే ఎక్కువ. ఇప్పుడు వారు పవన్ పొలిటికల్ ఫెల్యూర్ విషయంలో బాధపడుతున్నారు. పైగా ఖుషి అవుతున్నారు. మళ్లీ పవన్ ని సినిమాల్లో చూడొచ్చన్నది వారి ఆనందం. ఈ నేపథ్యంలోనే పవన్ ని మళ్లీ సినిమాలు చేయాలని కోరుతున్నారు.
జనసేన టార్గెట్ వచ్చే ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలే. 2024కి ఇంకా చాలా సమయం ఉంది. ఐదేళ్ల టైం ఉంది. కాబట్టి పార్టీ పనుల్ని చూసుకుంటూనే ఒకటో రెండో సినిమాలు చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు పవన్ కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే, అదెప్పుడు.. ఎన్నాళ్ల సమయం పడుతుందన్నది చూడాలి.