ఎన్ఎస్ఇకి సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ట్రిబ్యునల్‌ ఆదేశాలు

SMTV Desk 2019-05-25 16:03:18  national stock exchange securitys, sebi

ముంబయి: నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజికి సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీచేసింది. కోలోకేషన్‌ కేసులో వెంటనే 687 కోట్ల మొత్తాన్ని రెండువారాల్లోపు సెబీకి బదలాయించాలని ఆదేశాలు పంపింది. అలాగే ఎన్‌ఎస్‌ఇ పిటిషన్లను విచారించిన శాట్‌ వెంటనే సొమ్మును జమచేయాలని ఆదేశించింది. ఎన్‌ఎస్‌లోని అల్గోరిథమిక్‌ ట్రేడింగ్‌ వ్యవస్థలో నెలకొన్న కొలొకేషన్‌ సేవల్లో కుంభకోణంపైనే విచారణచేసిన సెబీ ఎన్‌ఎస్‌ఇకి భారీ జరిమానా విదించింది. ఈ మొత్తంపై ఎన్‌ఎస్‌ఇ శాట్‌కు అప్పీలుచేసినా పలితం లేకపోయింది. స్టాక్‌ ఎక్ఛేంజి అనవసంరంగా నెట్‌వర్క్‌ సెర్వర్లకు అనుచిత లబ్ది చేకూర్చిందని వెల్లడించింది. ఏప్రిల్‌లోనే సెబీ ఎక్ఛేంజిని లాభాలను రూ.1000 కోట్లువరకూ జమచేయాలని వెల్లడించింది. అలాగే కొత్త డెరివేటివ్స్‌ను ట్రేడింగ్‌ చేయకూడదని జరిమానా కూడా విదించింది. ఎన్‌ఎస్‌ఇతోపాటు ఇతర సంస్థలపై కూడా క్రమశిక్షణ వేటువేసింది. దీనితో కొందరు ఎన్‌ఎస్‌ఇ ప్రస్తుత మాజీ అధికారులు సిబ్బందిపై కూడా వేటుపడింది. సెబీ ఇప్పటికే ఐదువేరువేరు ఉత్తర్వులు జారీచేసింది. 400 పేజీల్లో వెలువరించిన ఈ ఉత్తర్వుల్లో కొలొకేషన్‌కేసుల్లోనే ఎన్‌ఎస్‌ఇ ప్రమేయం ఎక్కువ ఉందని నిర్ధారించింది. ఆల్గోట్రేడింగ్‌లో ఆర్డర్లు అత్యంత వేగంగా కదులుతుంటాయి, ఆదునిక గణిత విధానంలో ట్రేడింగ్‌ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది.