జపాన్ లో పర్యటిస్తున్న ట్రంప్

SMTV Desk 2019-05-25 15:46:19  donald trump, japan, america

జపాన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం తన భార్యతో కలిసి శుక్రవారం జపాన్ కు బయల్దేరారు. అయితే నరుహిటో అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ మొదటిసారి జపాన్ లో పర్యటించడం ఆసక్తిని కలిగిస్తోంది. దీనికి తోడు ఇప్పటికే చైనా, నార్త్ కొరియాలతో వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ జపాన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా వాణిజ్యం, మిలిటరీ అంశాలపైనే చర్చలు జరుగుతాయని ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ పర్యటనలో జపాన్ ప్రధాని షింజో అబె తో ట్రంప్ సమావేశం కానున్నారు.అయితే జపాన్ కు చేరుకొనే ముందు అలస్కాలో మిలిటరీ సోల్జర్స్ తో కాసేపు ముచ్చటించారు ట్రంప్.