విజయ్ దేవరకొండ లవ్ ఇంట్రెస్ట్ ఎవరో....?

SMTV Desk 2019-05-25 15:40:40  vijay deverakonda

ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడిది ఓ స్టైల్. శర్వానంద్ - సాయిపల్లవి జంటగా చేసిన పడి పడి లేచే మనసు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దాంతో ఆయన మరో ప్రేమకథను సిద్ధం చేసుకుని, తాజాగా విజయ్ దేవరకొండకి వినిపించాడట. కథ నచ్చేసిందని విజయ్ దేవరకొండ చెప్పడంతో, పూర్తిస్థాయి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో హను రాఘవపూడి వున్నాడని అంటున్నారు. మిలటరీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం క్రాంతిమాధవ్ .. ఆనంద్ అన్నామలై ప్రాజెక్టులతో విజయ్ దేవరకొండ బిజీగా వున్నాడు. ఆ రెండు ప్రాజెక్టులు ఒక దారికి వచ్చిన తరువాత ఆయన హను రాఘవపూడితో కలిసి సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు.