యూపీలో బీజేపీ జెండాను బూట్లుగా వేసుకున్న వ్యక్తి

SMTV Desk 2019-05-24 16:51:28  up, bjp, bjp flag

ఉత్తరప్రదేశ్ లోని ఈరోజు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. జౌన్పూర్ జిల్లాలోని షాగంజ్ గ్రామంలో ఈరోజు పోలింగ్ సందర్భంగా ఓ వ్యక్తి బీజేపీ జెండాలను బూట్లలాగా కాళ్లకు చుట్టుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. దీంతో అతడిని చూసిన బీజేపీ కార్యకర్తలకు కోపం నషాళానికి అంటింది. వెంటనే అతడిని పట్టుకుని చితకబాదారు. అయితే పోలింగ్ కేంద్రం పరిధిలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. లాఠీచార్జ్ చేసిన అనంతరం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.