చిత్తూరులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం.. 17 మందికి గాయాలు!

SMTV Desk 2019-05-24 16:47:19  chittor crime, private travels bus

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూతలపట్టు మండలం ఎం.బండపల్లి వద్ద అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 17 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందనీ, మిగతా వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ బస్సు బెంగళూరు నుంచి తిరుపతికి ప్రయాణికులతో వస్తోందని తెలిపారు. డ్రైవర్ ఏమరపాటుగా ఉండటంతో వాహనం అదుపు తప్పి చెట్లును ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.