మహర్షి సినిమా చూస్తా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

SMTV Desk 2019-05-24 16:37:30  maharshi, pawan kalyan

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మంచి మెసేజ్‌తో చిత్రాన్ని రూపొందించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో,బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌డుతుంది. కొన్ని చోట్ల ఈ మూవీ బాహుబ‌లి రికార్డుల‌ని కూడా తిర‌గరాసింద‌ని అంటున్నారు. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో రైతులు పడుతున్న కష్టాలు,ఆ ససమస్యలకు పరిష్కారాలు చూపించారు. ఎంత ఎదిగిన నేల మీద నడవాల్సిందే ఎంత గొప్పవాడైన అన్నం తినే ముందు తలవంచాల్సిందే ఇటు వంటి మాటల మధ్య లో కథను మల్చారు దర్శకుడు వంశి పైడిపల్లి. ఒక రైతుకు ఎంత అన్యాయం జరుగుతుందో ఈ సినిమాలో చూపించారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమా చూసేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ట‌. త్వ‌ర‌లో ఆయ‌న కోసం స్పెష‌ల్ షో వేయబోతున్న‌ట్టు స‌మాచారం.