'మన్మథుడు 2' లో సమంత పాత్ర ఇదే!!

SMTV Desk 2019-05-24 16:35:56  manmadhudu, manmadhudu 2, nagarjuna

నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సమంత ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆమె పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోను తలెత్తుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి తీసుకెళ్లే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం.

మన్మథుడు సినిమాలో కథానాయకుడు .. అమ్మాయిలకి ఎందుకు దూరంగా వుంటాడనేది తనికెళ్ల భరణి చెబుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళతాడు. అలాంటి పాత్రను ఈ సినిమాలో సమంత చేస్తోందని అంటున్నారు. మన్మథుడు 2 లో కథానాయకుడు అమ్మాయిలతో మాత్రమే చనువుగా ఉంటాడట. అందుకు కారణమేమిటనేది సమంత చెబుతుందని అంటున్నారు. మన్మథుడు భారీ విజయాన్ని సాధించిన కారణంగా, సహజంగానే మన్మథుడు 2 పై అంచనాలు వున్నాయి.