ఓటేసిన విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్

SMTV Desk 2019-05-24 16:19:12  Viart Kohli, Gambhir, vote

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లోనే కాదు.. ఓటేసిన క్రికెటర్లలో కూడా ముందు నిలిచాడు. హరియాణా గుడ్‌గావ్‌లోని పైన్‌క్రెస్ట్‌ పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీ క్యూలో నిల్చొని మరీ ఓటు హక్కు వినియోగించుకున్న కోహ్లీ.. ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు.

కోహ్లీ క్యూలో నిల్చొని ఉన్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సెలబ్రిటిలా కాకుండా ఓ సామాన్యుడిలా ఓటేసినందుకు అభిమానులు కోహ్లీపై ప్రశంసిస్తున్నారు. పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న కోహ్లీ.. ఓటరు అవగాహన కోసం బయట ఉన్న కటౌట్ దగ్గర నిల్చొని ఫొటో దిగాలి పోలింగ్ ఏజెంట్ కొరగానే అతనికి సహకరించాడు. ఆరో దశలో భాగంగా నేడు 7 రాష్ట్రాల్లో 59 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.

అలాగే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్‌నగర్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా గంభీర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.