చిన్నారి చికిత్సకు ప్రియాంక సాయం, స్ఫెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి

SMTV Desk 2019-05-24 16:17:08  lok sabha elections, rahul gandhi, political circles

తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తురపు ముక్క ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. సోదరుడు రాహుల్ గాంధీ కంటే మించి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీ సహా ఇతర బీజేపీ నేతలపై విమర్శలు చేస్తూ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకుల మనసు గెలుచుకుంటున్నారు.

తాజాగా ఆమె తనలోని మానవత్వాన్ని సైతం చూపించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఓ పాప ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. అయితే ఆమెకు వైద్యం చేయించే స్తోమత వారికి లేకపోవడంతో ప్రియాంక గాంధీని ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన ఆమె కాంగ్రెస్ నేతలు రాజీవ్ శుక్లా, హార్దీక్ పటేల్, మహ్మద్ అజారుద్దీన్‌లను సంప్రదించి.. చిన్నారిని ఢిల్లీకి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

దీంతో వారు ప్రత్యేక విమానంలో బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అలాగే పాపకు అందించే వైద్య సేవలను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రియాంక తెలిపినట్లుగా సమాచారం.