ప్రకాశం జిల్లాలో పిచ్చికుక్క స్వైరవిహారం.. 10 మందికి తీవ్రగాయాలు!

SMTV Desk 2019-05-24 16:16:20  prakasham crime, government, chennareddy

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఈరోజు ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. దారిన పోయేవాళ్లను వెంటపడి మరీ కరిచింది. ఈ ఘటనలో దాదాపు 10 మందికి తీవ్రగాయాలు కాగా, వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జిల్లాలోని తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. ఓ కుక్క ఎక్కడి నుంచో ఊరిలోకి వచ్చింది. ఉదయాన్నే పొలంలోకి వెళుతున్న రైతులు, కూలీలను తరుముకుంది. దీంతో పలువురు భయంతో పరుగెత్తారు.

ఈ సందర్భంగా పిచ్చికుక్క దొరికినవాళ్లను దొరికినట్లు కరిచింది. దీంతో స్థానికులు కర్రలు, రాళ్లతో దాన్ని తరిమేశారు. ఈ పిచ్చికుక్క స్వైరవిహారం సందర్భంగా దాదాపు 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందనీ, ప్రమాదమేదీ లేదని వైద్యులు తెలిపారు. కాగా, ఈ కుక్క బెడదను అరికట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.