వాళ్లకు ఎల్లవేళలా అండగా ఉంటా

SMTV Desk 2019-05-24 15:58:22  Spy reddy, pawan Kalyan

నంద్యాల జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డికి స్థానికంగా ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలిసినదే.కానీ గత కొన్ని రోజుల క్రితమే ఆయన ఆరోగ్యం క్షీణనించడం వలన కన్ను మూసారు.దీనితో ఒక్కసారిగా అక్కడ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.వారి కుటుంబం అంతా కన్నీటి పర్యంతం అయ్యారు.దీనితో జనసేన శ్రేణులు సహా పవన్ కూడా తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.గత కొన్ని రోజులు నుంచి వెకేషన్ లో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ ఈ రోజు ఎస్పీవై గృహానికి చేరి వారి కుటుంబాన్ని పరామర్శించారు.

ఆ అనంతరం పవన్ మరియు నాదెండ్ల మనోహర్ లు ఎస్పీవై సమాధికి పూల దండలు సమర్పించి వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.ఆ తర్వాత ఎస్పీవై కోసం కొన్ని వ్యాఖ్యలు చెప్పారు.తనకి పదిహేనేళ్ల క్రితమే ఎస్పీవై చేసిన మంచి పనుల వలన ఆయనేంటో తెలుసుకున్నానని ప్రజలకు ఎంతో ప్రీతివంతమైన వ్యక్తి తన పార్టీలోకి రావడం,నంద్యాల నుంచి పోటీ చెయ్యడం ఆయనతో కలిసి మరిన్ని రోజులు ముందుకు వెళదామని అనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు ఆయన మన మధ్యలో లేరని తెలిపారు.ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అలాగే వారి కుటుంబానికి ఎల్లవేళలా తాను అండగా ఉంటానని మాటిచ్చారు.