దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న కెసిఆర్

SMTV Desk 2019-05-24 15:49:48  Indrakaran reddy, kcr ,

సిఎం కెసిఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కెసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపారని ఆయన కొనియాడారు. శనివారం బాస‌ర మండ‌లం బిద్రెల్లిలో టిఆర్‌ఎస్ జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులకు మద్దతుగా అల్లోల ముమ్మరం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కెసిఆర్ దేశ రాజకీయాల్లో చక్ర తిప్పనున్నారని ఆయన పేర్కొన్నారు. రైతును రాజుగా చేసేందుకు కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్ సభ , పరిషత్ ఎన్నికల్లో పునరావృతం కానున్నాయని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ బలపర్చిన జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ముధోల్ ఎంఎల్ఎ విఠ‌ల్ రెడ్డి, జ‌డ్పిటిసి, ఎంపిటిసి అభ్య‌ర్థులు పాల్గొన్నారు.