మహిళల కోసం ప్రత్యేకంగా.....

SMTV Desk 2019-05-24 13:00:44  durantho, rajadhaani, shatabdi, trains

దురంతో, రాజధాని, శతాబ్ది వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించే మహిళలు, వికలాంగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ రైళ్లలో వారి కోసం అదనపు బోగీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. నిజానికి ఈ రైలుకు అదనపు బోగీ ఏర్పాటు చేయరు. పవర్‌కార్‌ను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఓ బోగీ ఖాళీగా మిగులుతుంది. దానిని వీరి కోసం కేటాయించనున్నారు.

పైన పేర్కొన్న రైళ్లలో విద్యుత్ సరఫరా కోసం రెండు పవర్ కార్లను వినియోగిస్తున్నారు. ఇవి రెండు బోగీల్లో ఉంటాయి. ఇందులో ఒకటి ఏసీ కోసం కాగా, రెండోది రైలులో విద్యుత్ సరఫరాకు. ఇప్పుడీ పవర్‌కార్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. జర్మనీకి చెందిన లింగ్ హాఫ్‌మన్ బోష్ (ఎల్‌హెచ్‌బీ) ఈ రైళ్ల బోగీలను తయారు చేసింది. ఇప్పుడు అప్‌గ్రేడ్ చేయనున్న పవర్‌కార్ ఒక్క బోగీకే పరిమితం అవుతుంది. దీంతో రెండోది ఖాళీగా మిగులుతుంది. దానిని మహిళలు, వికలాంగుల కోసం కేటాయించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.