ఆ ద‌ర్శ‌కుడితో హ్యాట్రిక్‌ ప్లాన్ చేస్తున్న ర‌వితేజ

SMTV Desk 2019-05-24 12:34:43  ravi teja, don srinu, balupu, gopichand malineni

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `డిస్కోరాజా` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మే 27 నుండి రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ఈ సినిమా పూర్తి కాక‌ముందే ర‌వితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. విన‌ప‌డుతున్న‌వార్త‌ల ప్ర‌కారం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ సినిమా చేయ‌బోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వ‌ర‌కు డాన్ శీను, బ‌లుపు చిత్రాలు వ‌చ్చాయి. రెండు సినిమాల చాలా పెద్ద హిట్ అయ్యాయి. అంతా స‌వ్యంగా సాగితే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో హ్యా్ట్రిక్ మూవీ అవుతుంది. ఇంకా ఈ సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంద‌ని టాక్‌.