డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల యువకుడి మృతి

SMTV Desk 2019-05-24 12:28:01  drugs, overdose drugs, hyderabad crime,

డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల రాజేంద్రనగర్‌కు చెందిన పండు (19 ) అనే యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే రాజేంద్రనగర్‌లోని శివరంపల్లి గ్రామనికి చెందిన శివకుమార్ గత ఎనిమిది సంవత్సరాలుగా శివరాంపల్లిలో నివాసం ఉంటున్నారు. కాగా శివకుమార్‌కు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు పండు(19) దిల్‌సుక్ నగర్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ మధ్యలో మానివేసి తన తండ్రికి గల వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు.

గత కొంతకాలంగా.. గంజాయి ‌డ్రగ్స్ లాంటి అలవాట్లున్న పండు శుక్రవారం సాయంత్రం పెద్ద మొత్తంలో డ్రగ్స్ మాత్రలు తీసుకోవడం వలన మృతి చెందాడు. పండు మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.