ఎయిర్ టెల్ సిమ్ వాడుతున్నారా అయితే లైఫ్ ఇన్స్యూరెన్స్ ఫ్రీ

SMTV Desk 2019-05-24 12:26:06  Airtel, Life insurance

రిలయన్స్ జియో టెలికాం రంగంలోనే సంచ‌ల‌నం సృష్టించింది. భారీ ఆఫర్లతో టెలికాం రంగాన్ని షేక్ చేసింది. దీంతో మిగతా టెలికాం కంపెనీలు జియోకు దీటుగా ఆఫర్ల ప్రకటిస్తున్నాయి. తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు నానా పాట్లు పడుతున్నాయి. దీంతో టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ పెరిగింది.

తాజా తన వినియోగదారుల కోసం ఎయిర్ టెల్ కొత్తగా రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ఇండియాలోని యూజర్లందరికీ రూ.129, రూ.249 ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రూ.4 లక్షల లైఫ్ ఇన్స్యూరెన్స్ కల్పిస్తోంది. ఇక రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, STD, నేషనల్ రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB 3G లేదా 4Gడేటా, 100SMSలు లభిస్తాయి. ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రూ.249 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. దీంతోపాటు ఏడాదిపాటు నార్టాన్ మొబైల్ సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.129 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు వస్తాయి. ఈ ప్లాన్ 28 రోజులకు వర్తిస్తుంది.

రూ.249 ప్లాన్‌పై రూ.4 లక్షల ఇన్స్యూరెన్స్ …HCFC లైఫ్ ఇన్స్యూరెన్స్, భారతీ ఆక్సా నుంచి ఈ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. ఒకసారి రీఛార్జ్ చేసుకున్నవారి మొబైల్‌కు పాలసీకి సంబంధించిన SMS వస్తుంది. ఆ తర్వాత ఇన్స్యూరెన్స్ పాలసీ కోసం కేవైసీ వివరాలను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.