వైరల్ అవుతున్న మెగా ఫోటో

SMTV Desk 2019-05-24 12:23:11  Varun Tej, Pawan Kalyan,

మెగా కుటుంబానికి చెందిన అరుదైన ఫొటో బయటికి వచ్చింది. యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌ తన తండ్రి నాగబాబు, పెదనాన్న చిరంజీవి, బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి బాల్యంలో దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ‘పాత ఫొటోల్లో నుంచి దీన్ని బయటికి తీశా. నాకు ఎంతో ఇష్టమైన వాళ్లతో.. వీరిని ఎంతో ప్రేమిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలో వరుణ్‌ను పవన్‌ తన భుజాలపై ఎత్తుకుని కనిపించారు. మెగా కుటుంబానికి చెందిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

వరుణ్‌ ఈ ఏడాది ‘f2’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘వాల్మీకి’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’ కు తెలుగు రీమేక్‌ ఇది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.