రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు ...

SMTV Desk 2019-05-24 12:22:27  Telangana, Rains,

తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారాయి, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 43 నుంచి 46డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే మొదలవుతున్న ఎండలు దంచికొడుతున్నాయి. రాత్రి వరకు వేడి సెగలు పుట్టిస్తున్నాయి. ప్రచండంగా కాస్తున్న ఎండకు వడగాడ్పులు తోడయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండలకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం నుంచే తీవ్రతతో రోడ్లన్నీనిర్మానుష‌్యంగా మారుతున్నాయి. రాత్రిళ్లు కూడా వాతావరణం వేడిగా ఉండటంతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎండలకు ఉడికిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. వర్షాలు పడని ప్రాంతాల్లో మాత్రం తీవ్రంగా వడగాలులు వీస్తాయని తెలిపింది.