రాబర్ట్ వాద్రాకు ముంబా దేవీ ఆలయంలో ఓ వింత అనుభవం

SMTV Desk 2019-05-24 12:18:27  priyanka gandhi, robert vadra, mumba devi

ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ముంబాదేవీ ఆలయంలో ఓ వింత అనుభవం ఎదురైంది. ముంబా దేవీ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన రాబార్ట్ వాద్రా చుట్టూ వున్న భక్తులు ’మోదీ... మోదీ‘ అని నినాదాలు చేయడంతో ఆయన కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. వాద్రా ఆలయంలోకి ప్రవేశించగానే ఒక్కసారిగా భక్తులు ’భారత్‌మాతాకీ జై, మోదీ జిందాబాద్‘ అని నినాదాలు చేశారు. ఈ నినాదాలతో ఆలయంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వాద్రా బయటికి వెళ్లడానికి మార్గం సుగుమం చేశారు. దీంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ఆశీస్సులు తీసుకోవడానికే తాను ఆలయానికి వచ్చానని, రాజకీయాలు చేయడానికి కాదని, అయినా రాజకీయాలు గుడిలో చేయడం సరికాదని హితవు పలికారు.