మహర్షి బ్లాక్ బస్టర్ : అల్లరి నరేష్ ఎమోషనల్ ట్వీట్

SMTV Desk 2019-05-11 16:25:22  Allari Naresh, Maharshi

అల్లరి సినిమాతో హీరోగా పరిచయమైన ఈవివి సత్యనారాయణ తనయుడు నరేష్ తన మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఒకప్పుడు ఇయర్ లో నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ ఫాం లో ఉన్న అల్లరి నరేష్ ఈమధ్య చేస్తున్న సినిమాలేవి సక్సెస్ కాకపోవడంతో కెరియర్ లో వెనుకపడ్డాడు. అదీకాకుండా ఇప్పుడు కామెడీ, స్పూఫ్ సినిమాలతో చాలామంది ప్రయత్నిస్తున్నారు. అందుకే నరేష్ కు కాస్త మార్కెట్ తగ్గిపోయింది. అయినా అడపాదడపా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే కెరియర్ లో హీరోగానే కాకుండా స్పెషల్ రోల్స్ లో నటిస్తున్నాడు అల్లరి నరేష్.

గమ్యం సినిమాలో గాలి శీనుగా నటించగా.. శంభో శివ శంభోలో కూడా చెవిటి వాడిగా మెప్పించాడు. ఇక నిన్న రిలీజైన మహర్షి సినిమాలో రవి పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు. అయితే మే 10 2002లో అల్లరి సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన నరేష్ ఆ సినిమాలో కూడా తన పాత్ర పేరు రవి అని.. అదే పాత్రతో 17 ఏళ్ల తర్వాత మళ్లీ తన కెరియర్ ఊపందుకున్నదని ఓ ఎమోషనల్ మెసేజ్ తన ట్విట్టర్ లో పెట్టాడు అల్లరోడు.

మహర్షి సినిమాలో నరేష్ పాత్ర ఉన్నంతవరకు చాలా బాగుంది. మహర్షి హిట్ లో అతని భాగం ఉంది కాబట్టి ఈ హిట్ తన ఖాతాలో కూడా పడినట్టే. మరి రానున్న సినిమాలతో అయినా ఈ హిట్ మేనియా కొనసాగించాలని ఆశిద్దాం.