అందుకు ఏం చేసేందుకైనా సిద్ధం: కేజ్రీవాల్

SMTV Desk 2019-05-11 16:18:59  kejriwal, aap, congress, bjp, modi, amit shah

బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ సహా ఏ పార్టీకైనా మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టో సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోదీ-షా ద్వయాన్ని అధికారంలోకి రానీయకుండా నిలువరించేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమన్నారు.

అమిత్ షా గతంలో ఢిల్లీకి చొరబాటు దారులను ఉపేక్షించబోనంటూ చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తప్పుబట్టారు. అమిత్ షా మాటలను బట్టి చూస్తే మూడు మతాల ప్రజలను తప్పించి, మిగతావారిని రాజధాని నుంచి తరిమికొట్టే ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్రం జోక్యం లేకుండా ఢిల్లీలో స్వతంత్రత కల్పించగలిగిన పార్టీకి తమ తొలి ప్రాధాన్యమిస్తామన్నారు.