టీవీ9 కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రా నియామకం

SMTV Desk 2019-05-11 15:53:59  tv9 ceo, mahendra mishra, tv9 ravi prakash

ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ ను తొలగించారు. ఆయన స్థానంలో మహేందర్ మిశ్రాను నియమించారు. కొత్త సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించారు. మహేందర్ మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడకు ఎడిటర్ గా ఉన్నారు. గొట్టిపాటి సింగారావు గతంలో మాటీవీలో కీలక బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం 10టీవీ సీఈవోగా ఉన్నారు. కాసేపటి క్రితం సమావేశమైన ఏబీసీఎల్ డైరెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఈవో, సీఓఓ మార్పుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించారు.