విశాల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్

SMTV Desk 2019-05-11 12:45:36  tamil actor, vishal, aneesha reddy, nadigar sangam

తమిళ్ స్టార్ విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ అమ్మాయి అనీషారెడ్డిని పెళ్లాడబోతున్నాడు. ఇటీవలే వీరి నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తాజాగా పెళ్లి డేటు ఫిక్సయినట్టు సమాచారమ్. ఈ యేడాది అక్టోబర్ 9న పెళ్లి ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వివాహ వేదిక హైదరాబాద్, చెన్నై లేక ఫారిన్ లో ప్లాన్ చేశారా ? అన్నది తెలియాల్సి ఉంది. నడిగర్ సంఘం(తమిళ నటీనటుల సంఘం) బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు తాను పెళ్లి చేసుకోను అంటూ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్ గతంలో శపథం చేసిన సంగతి తెలిసిందే. బిల్డింగ్ నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు.