దేశంలో బిజెపికి అనుకూల గాలి

SMTV Desk 2019-05-11 12:44:11  Modi, Chandrababu

ఢిల్లీ : ఎపి సిఎం, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. చంద్రబాబు ఇవిఎంల పనితీరును తప్పుబట్టడం దారుణమని ఆయన పేర్కొన్నారు. తొలి మూడు దశల్లో జరిగిన పోలింగ్ సమయంలో చంద్రబాబు తనను, బిజెపిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. అయితే ప్రస్తుతం దేశంలో బిజెపి, దాని మిత్ర పక్షాల గాలి వీస్తుండడంతో చంద్రబాబు ఇవిఎంలపై అభాండాలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాసామ్యంపై చంద్రబాబుకు నమ్మకం లేదని, ఈ క్రమంలోనే ఆయన ప్రజల తీర్పు ఏవిధంగా ఉంటుందో తెలిసి, ఒకవేళ తాను ఓడిపోతే ఇవిఎంలే కారణమనే రీతిలో ఆయన సాకు చూపే విధంగా సాగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బిజెపియేతర కూటమిని గట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడం తథ్యమని ఆయన పేర్కొన్నారు. మరోసారి తామే అధికారంలోకి వస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను ప్రజలు నమ్మడం లేదని, దేశంలో బిజెపి అనుకూల గాలి వీస్తుందని ఆయన స్పష్టం చేశారు.