నంద్యాలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

SMTV Desk 2019-05-10 17:02:07  Pawan Kalyan, Nadyala,

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రేపు కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లనున్నారు. అందులో భాగంగా ఈమధ్య మరణించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు పవన్. ఆ తర్వాత ఎస్పీవై రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించనున్నారు.

అదేవిధంగా టీడీపీ నుంచి మరోసారి నంద్యాల లోక్‌సభ స్థానం టికెట్ ఆశించి భంగపడిన ఎస్పీవై రెడ్డి... సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన.. ఎన్నికల ప్రచార సమయంలో అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌ లోని కేర్ హాస్పిటల్ లో చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే.