సుప్రీం కోర్టుకు సెలవులు

SMTV Desk 2019-05-10 17:01:19  Supreme Court,

ఈ నెల 13వ తేదీ నుంచి జూన్ 30 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించబడ్డాయి. అంటే రేపటి నుంచి సుప్రీం కోర్టుకు సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణ నిమిత్తం ప్రత్యేక ధర్మాసనాలను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. మే 13 నుంచి మే 20వ తేదీ వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం, మే 21 నుంచి మే 24 వరకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్. షా ధర్మాసనం, మే 25 నుంచి మే 30 వరకు సీజేఐ జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ ఎం.ఆర్. షా ధర్మాసనం, మే 31 నుంచి జూన్ 2వ తేదీ వరకు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ ఎం.ఆర్. షా ధర్మాసనం, జూన్ 3 నుంచి జూన్ 5 వరకు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎం.ఆర్. షా ధర్మాసనం, జూన్ 6 నుంచి జూన్ 13వ తేదీ వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగి ధర్మాసనం అత్యవసర వ్యాజ్యాలను విచారించనుంది. జూన్ 14 నుంచి జూన్ 30 వరకు ధర్మాసనాల వివరాలు తర్వాత వెల్లడి కానున్నాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.