పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల తేదీ ఖరారు

SMTV Desk 2019-05-10 16:59:01  ssc results, 10th results, 2019 results 10

రాష్ట్రంలో 2019 మార్చ్ లో జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలు మే 13వ తేదీన విడుదల కానున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మే 13 సోమవారం రోజున ఉదయం 11.30 నిమిషాలకు సెక్రటేరియట్, డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు.

ఈ ఫలితాలను www.bse.telangana.gov.in, www.results.cgg.gov.in అధికారిక వెబ్ సైట్లలో చూడొచ్చని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టరేట్ కార్యాలయం ప్రకటించింది.

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో తప్పులు దొర్లడం.. పెద్ద వివాదానికి కారణమైంది. దీంతో… ఈసారి టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలను తప్పుల్లేకుండా.. స్పష్టంగా విడుదల చేయాలని… అధికారులకు ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆలస్యమైనా పర్వాలేదనీ… 0 మార్కులు, 99 మార్కులు, యాబ్సెంట్ ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసిన తర్వాతే నమోదు చేయాలని ఇటీవల సూచించింది. తాజాగా.. టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది.