ఆలయంలో చోరీ .. 25వేల నగదు స్వాహా

SMTV Desk 2019-05-10 16:42:45  Temple, sai Baba, nagarjuna sagar

నాగార్జుననగర్​లోని షిర్డిసాయి బాబా ఆలయంలో చోరీ జరిగింది.తాళాలు పగులగొట్టిన దొంగలు బాబా ఆభరణాలు, హుండీలోని సొత్తు దోచుకెళ్లారు. హుండీలో సుమారు 25వేల నగదు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.