చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన కిడారి శ్రావణ్

SMTV Desk 2019-05-10 16:40:15  Kidari sravan, Chandrababu

6 నెలల పదవీ కాలం ఎంతో సంతృప్తినిచ్చింది,గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చి తండ్రి ఆశయాన్ని నెరవేర్చా,నా కుటుంబానికి అండగా నిలిచిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు, గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలన్న తన తండ్రి ఆశయాన్ని నెరవేరవేర్చడం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చిందని , రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రాధమిక ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశానని అరకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు.

కష్ట సమయంలో తనకు మంత్రి పదవి ఇచ్చి తమ కుటుంబానికి అండగా నిలిచిన సీఎం చంద్రబాబునాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర ఓఎస్డీ మారుతిప్రసాద్ కు కిడారి శ్రావణ్ కుమార్ తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరారావు మరణాంతరం సీఎం చంద్రబాబునాయుడు తమ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. టీడీపీలో జూనియర్ నైన తనకు సీనియర్ నేతలు కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడి వంటి వారు అండగా నిలిచి, ఎంతో ప్రోత్సాహమందించారని కొనియాడారు. నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో సీఎం చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన దిశానిర్దేశంలో రాష్ట్రాభివృద్ధికి పనిచేయడం తన జీవితం ధన్యమైందన్నారు.6 నెలల పదవీ కాలం ఎంతో సంతృప్తినిచ్చింది.

తన 6 నెలల పదవీ కాలంలో మూడు నెలలు ఎన్నికల కోడ్ ఉందని శ్రావణ్ కుమార్ తెలిపారు. తన పదవీ కాలంలో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలు ఎంతో సంతృప్తి నిచ్చాయన్నారు. 50 ఏళ్లకే గిరిజనులకు పెన్షన్లు ఇవ్వాలన్నది తన తండ్రి కిరాడారి సర్వేశ్వరరావు ఆశయమన్నారు. తాను గిరిజన మంత్రిగా ఉన్నప్పుడు గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, తండ్రి ఆశయాన్ని నెరవేర్చాననే ఆత్మ సంతృప్తినిచ్చిందని అన్నారు. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు గానూ ఫుడ్ బాస్కెట్లు పంపిణీ చేశామన్నారు. అరకు ప్రభుత్వాసుపత్రిని 50 నుంచి 150 పడకలకు, పాడేరు ప్రభుత్వాసుపత్రికి 100 నుంచి 200 పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేశామన్నారు. తనకు సీఎం చంద్రబాబునాయుడు మంత్రి ఇవ్వడం…గిరిజనుల సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. తనకు సహకరించిన అధికారులకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.