మొబైల్ వినియోగ దారులకు శుభవార్త

SMTV Desk 2019-05-10 16:39:24  Nokia mobile

హెచ్ఎండీ గ్లోబ‌ల్ త‌న నోకియా 6.1 ప్లస్‌, 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను గ‌తేడాది ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ నెల‌ల్లో భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటికి మంచి ఆదరణ కూడా లభించింది. నోకియా 6.1 ప్లస్ రూ.15,999 ధ‌ర‌కు, 5.1 ప్లస్ రూ.10,999 ధ‌ర‌కు ఇప్పటి వ‌ర‌కు ల‌భ్యం అయ్యాయి. అయితే ఇప్పుడీ ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది కంపెనీ. నోకియా 6.1 ప్లస్ 4జీబీ ర్యామ్ వేరియెంట్‌, నోకియా 5.1 ప్లస్ 3జీబీ ర్యామ్ వేరియెంట్లకు గాను లిమిటెడ్ టైమ్ ఆఫ‌ర్ కింద ధ‌ర‌ను త‌గ్గించారు.


రూ.1750 డిస్కౌంట్‌ను ఈ ఫోన్లకు అందిస్తున్నారు. వినియోగదారులు నోకియా ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ఫోన్లను కొనుగోలు చేసేట‌ప్పుడు DEAL1750 అనే కోడ్‌ను ఇచ్చి ఆ మేర డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఎయిర్‌టెల్ వినియోగ‌దారులు ఈ ఫోన్లపై రూ.2వేల క్యాష్‌బ్యాక్‌ను పొంద‌వ‌చ్చు. కాగా నోకియా 5.1 ప్లస్ 3జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర త‌గ్గింపుతో రూ.8849 ధ‌ర‌కు ల‌భిస్తున్నది. అలాగే నోకియా 6.1 ప్లస్ 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర త‌గ్గింపుతో రూ.13,749 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగదారులు వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని కంపెనీ తెలిపింది.