అవును రిలేషన్షిప్ లో ఉన్నాను....కానీ: జాన్వీ కపూర్ కో-స్టార్

SMTV Desk 2019-05-10 16:29:40  janhvi kapoor, ishaan khatter, dhadak

అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన స్నేహితుడు ఇషాన్ ఖట్టర్ తో ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఒకే సినిమాతో వెండితెరకి పరిచయం కావడం, తరచూ పార్టీలుమ డిన్నర్ లు అంటూ తిరగడంతో వార్తలు మరింత ఎక్కువయ్యాయి.

అయితే గతంలో ఈ విషయంపై జాన్వీని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని చెప్పింది. తాజాగా ఈ విషయంపై ఇషాన్ కాస్త భిన్నంగా స్పందించాడు. నేహా ధూపియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షోకి ఇషాన్ హాజరయ్యాడు.

ఈ సందర్భంగా అతడిని.. నీకు జాన్వీకి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా..? అని ప్రశ్నించగా.. అతడు సూటిగా సమాధానం ఇవ్వలేదు. నేను ప్రస్తుతం రిలేషన్షిప్ లో ఉన్నాను.. కానీ అది కాఫీ అంటూ చెప్పుకొచ్చాడు.

జాన్వీతో రిలేషన్ గురించి అడిగితే కాఫీ గురించి చెప్పి తప్పించుకున్నాడే తప్ప తమ మధ్య ప్రేమ ఉంది.. లేదనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఈ హీరో తన తదుపరి ప్రాజెక్ట్ ని సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. మరోపక్క జాన్వీ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.