హీరోతో ఎఫైర్ పై స్పందించిన ప్రియా ప్రకాష్ వారియర్

SMTV Desk 2019-05-10 16:28:24  wink girl, nation crush, priya prakash varrier

వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క వీడియోతో ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారిపోయింది. ఆమె నటించిన తొలి చిత్రం ఒరు అడార్ లవ్ ఫ్లాప్ అయినప్పటికీ ఆమెపై ఎంత మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం సినిమాలు, యాడ్స్ అంటూ బిజీ హీరోయిన్ గా గడుపుతోంది.

అయితే ఒరు అడార్ లవ్ సినిమా సమయంలో ప్రియా తన కో స్టార్ రోషన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ సన్నిహితంగా మెలగడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. రీసెంట్ గా రోషన్ పుట్టినరోజు సందర్భంగా.. ప్రియా ప్రకాష్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అతడికి విషెస్ చెప్పింది.

తన కోసం రోషన్ ఎంతో చేశాడని, అతడిపై మాటల్లో చెప్పలేనంత అభిమానం ఉందని ప్రియా పోస్ట్ లో రాసుకొచ్చింది. అది చూసిన వారంతా కూడా ప్రియా, రోషన్ లు ప్రేమించుకుంటున్నారని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. తాజాగా ఈ విషయంపై ప్రియా స్పందించింది. రోషన్ తో ప్రేమలో ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పింది.

రోషన్ కి తనకు మధ్య మంచి రాపో ఉందనే విషయం నిజమే కానీ అందరూ అనుకున్నట్లుగా కాదని తెలిపింది. ఇద్దరం కలిసి ఒకే సినిమాతో పరిచయం కావడం, సేమ్ ఏజ్ గ్రూప్ కావడం వల్ల క్లోజ్ అయ్యామని అంతకుమించి తమ మధ్య ఏం లేదని చెప్పుకొచ్చింది.

రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయని, నిజాలు తెలిసినప్పుడు వాటికి విలువ ఉందని చెప్పింది. తన వృత్తిలో రూమర్స్ అనేవి కామన్ అని, తన పని తాను నిజాయితీగా చేసుకుంటూ మిగిలినది ప్రజలకే వదిలేస్తానని వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో నటించిన శ్రీదేవి బంగ్లా అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.