మహర్షి కలెక్షన్స్ చూస్తే షాక్

SMTV Desk 2019-05-10 14:10:56  Maharshi, Mahesh Babu,

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ గురువారం(మే 9) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీసును షేక్ చేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్దే నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌లు ఈ సినిమాను భారీ హంగులతో నిర్మించారు. మహేష్ కెరియర్‌లో ఒక చిత్రానికి ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ఎంత ఖర్చు పెట్టారో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. ఇక తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ‘మహర్షి’ రూ.33.5కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.61కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది మహేశ్‌బాబు కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లని సినీ ట్రేడ్ వర్గాల సమాచారం. ఏపీ, నైజాం, ఓవర్సీస్ అన్నీ కలుపుకుని రూ. 95 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అన్నీ కలుపుకుంటే నిర్మాతలు సినిమా విడుదలకు ముందే సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు