ఓవర్సీస్ లో మహర్షి డీలా

SMTV Desk 2019-05-10 14:01:06  Maharshi,

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ సినిమా “మహర్షి” ఈరోజే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది.ఈ సినిమా విడుదల కావడంతోనే మిక్సిడ్ మౌత్ టాక్ ను సంతరించుకుంది.వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల అయినా సరే ఈ సినిమా వసూళ్లు ఊహించిన స్థాయిలో వస్తాయా రాదా అన్న సందేహం ఇప్పుడు అభిమానులలో కూడా కలుగుతుంది.ఎందుకంటే మహేష్ కు మన దగ్గర కన్నా ఓవర్సీస్ మార్కెట్ లో ఏ రేంజ్ స్టామినా ఉందో అందరికీ తెలుసు.

అట్టర్ ప్లాప్ సినిమాలతో కూడా అక్కడ 1 మిలియన్ డాలర్లు రాబట్టిన ఏకైక హీరోగా మహేష్ కు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.కానీ ఇప్పుడు ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే మూడు విభిన్న షేడ్స్ అలాగే అద్భుతమైన కాన్సెప్ట్ అని ముందే తెలిసింది.కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకు ఊహించనంత స్థాయిలో ప్రీమియర్స్ అయితే పడలేదు.మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాపులుగా నిలిచిన “ఆగడు” మరియు “బ్రహ్మోత్సవం” కన్నా తక్కువ రాబట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

గతంలో విడుదలైన “భరత్ అనే నేను” కి 8 లక్షల 50 వేల డాలర్లు ఒక్క ప్రీమియర్స్ లోనే రాబట్టగా ఈ సినిమాకు మాత్రం కేవలం 5 లక్షల 90 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి.ఇన్ని అంచనాలతో వచ్చిన ఈ సినిమా వసూళ్లు ఇంత తక్కువ రావడం నిజంగా ఆశ్చర్యకరమే అని చెప్పాలి.ఎప్పుడు లేని విధంగా మహేష్ మార్కెట్ ఇంతలా పడిపోవడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు మహేష్ అభిమానులకు అంతి చిక్కని ప్రశ్నగా మారిపోయింది.