హిప్పీ ట్రైలర్ రివ్యూ

SMTV Desk 2019-05-10 13:55:28  Hippi trailer, Karthikeya,

అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హిప్పీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మనోడు త‌మిళ చిత్ర సీమ‌కి ప‌రిచ‌యం కాబోతున్నాడు. తెలుగు-తమిళ్ బైలింగ్యువ‌ల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా జూన్ 7న విడుద‌లకి సిద్దమయ్యింది. కబాలి లాంటి సినిమాలను తెరకెక్కించిన కలైపులి ఎస్‌. థను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాని టిఎన్‌ కృష్ణ అనే నూతన దర్శకుడు తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో దిగాంగ‌న సూర్య‌వంశీ, జ‌జ్బా సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.
ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంకి సంబంధించి తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల‌ మేక‌ర్స్. ఇందులో కార్తికేయ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మవుతుంది. రొమాంటిక్ స‌న్నివేశాలు కూడా ఎక్కువ‌గానే ఉన్న‌ట్టు ట్రైలర్ ని బట్టి తెలుస్తుంది. జేడీ చ‌క్ర‌వ‌ర్తి ఈ సినిమాతో చాలా కలం తర్వాత కనిపిస్తున్నారు. ఇక నివాస్ ప్రసన్న అందించిన స్వరాలు కూడా సినిమాకి మేజ‌ర్ ప్ల‌స్ అవుతుంద‌ని టీం అంటుంది. చూడాలి వారి అంచనాలను ఎంత మేరకు అందుకుంటాడో ?