ముద్దులతో... సస్పెన్స్ తో 'సెవెన్' ట్రైలర్.

SMTV Desk 2019-05-10 13:37:18  Seven trailer,

హ‌వీష్ హీరోగా ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న సెవెన్ అనే సినిమా జూన్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో రెజీనా, నందిత శ్వేత‌, పూజిత పొన్నాడ, అదితి ఆర్య లాంటి నటీనటులు ఈ మూవీ లో న‌టిస్తున్నారు. త‌మిళ న‌టుడు రెహ‌మాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాని స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా సెవెన్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు ర‌మేష్ వ‌ర్మ‌. ఈరోజు విడుద‌లైన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచుతోంది, గతంలో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సినిమా మీద అంచనాలు పెంచగా ఈ ట్రైలర్ లో కూడా రొమాన్స్ విత్ స‌స్పెన్స్ చూపించాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా హ‌వీష్ హీరోయిన్ల‌తో చేసే రొమాన్స్ ట్రైల‌ర్లో బాగా హైలైట్ అయ్యేలాగా కట్ చేశారు. ఇప్పటికి చాలా సినిమాలు చేసినా ఈ హీరోకి సరయిన బ్రేక్ దొరకలేదు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా త‌న‌కు బ్రేక్ ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాడు హ‌వీష్.