లైవ్ స్ట్రీమింగ్‌లో అభిమానులను పెంచుకోవాలనుకుంది.... కానీ పాపం చివరికి ఇలా

SMTV Desk 2019-05-10 13:33:29  feat fail, viral video, octopus eating

బతికున్న ఆక్టోపస్ చాలా రుచిగా ఉంటుందట. ఇదంటే దక్షిణ కొరియా వాసులు పడిచస్తారు. అది బతికి ఉండగానే ఆవురావురుమంటూ లాగించేస్తుంటారు. అయితే, ఇది ఎంత రుచికరమో.. అంతే డేంజర్ కూడా. తినేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ముఖాన్ని పట్టుకుని పీకేస్తుంది. నోట్లో వేసుకుంటే గొంతుకు అడ్డం పడి నానా ఇబ్బంది పెడుతుంది. అందుకనే ఇలా తినడం కూడదని హెచ్చరిస్తుంటారు.

ఈ హెచ్చరికలను పక్కనపెట్టిన చైనాకు చెందిన ఓ యువతి లైవ్ స్ట్రీమింగ్‌లో దానిని తిని అభిమానులను పెంచుకోవాలనుకుంది. బతికున్న ఆక్టోపస్‌ను చేతిలో పట్టుకుంది. ఇక తినడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఆమె కంటే ముందే ఆక్టోపస్ స్పందించింది. ఆమె బుగ్గను, కళ్ల కింది భాగాన్ని తన టెంటకిల్స్‌తో గట్టిగా పట్టుకుని పీకింది. దీంతో అమ్మాయి విలవిల్లాడిపోయింది. లైవ్ స్ట్రీమింగ్‌లోనే ఏడ్చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.