మంత్రి పదవికి రాజీనామా చేసిన కిడారి శ్రవణ్

SMTV Desk 2019-05-10 12:55:00  kidari shravan, kidari srinivas, nara lokesh, tdp minister

మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఏ చట్ట సభలోనూ సభ్యుడు కానందునన శ్రవణ్‌తో రాజీనామా చేయించాల్సిందిగా గవర్నర్ నరసింహన్.. సీఎం చంద్రబాబుకు సూచించారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి సూచనతో శ్రవణ్ తన పదవికి గురువారం రాజీనామా చేశారు. అంతకు ముందు ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌తో సమావేశమైన శ్రవణ్.. రాజీనామా విషయంపై చర్చించారు. అనంతరం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకు అందజేశారు.