తిట్టండి.. మీరు ఎంత తిడితే మాకు అంత మంచిది!

SMTV Desk 2019-05-10 12:48:31  pm modi, mamata benrjee, west bengal cm,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ సీఎం మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు. తనను దేశప్రధానిగా అంగీకరించబోనని మమత అంటున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ప్రధానిని గుర్తించకపోవడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని మోదీ స్పష్టం చేశారు. తనను ప్రధానిగా అంగీకరించలేని మమత పాకిస్థాన్ ప్రధానిని మాత్రం అంగీకరిస్తారని సెటైర్ వేశారు.

ఆమె ఎంత తిడితే తమకు అంత మంచిదని, ఆమె తిట్లే తమకు దీవెనలు అని మోదీ పేర్కొన్నారు. మమతకు బెంగాల్ పట్ల ఎలాంటి శ్రద్ధ లేదని, ఫణి తుపాను నేపథ్యంలో తాను ఫోన్ చేస్తే స్పందించకపోవడమే అందుకు నిదర్శనం అని విమర్శించారు. ఓటమి తప్పదన్న అసహనంలో ఆమె రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లోని బంకురాలో జరిగిన ఎన్నికల సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.