నా టైటానిక్ ను మీ అవెంజర్స్ ముంచేసింది!

SMTV Desk 2019-05-10 12:45:05  titanic, avatar, avengers: the end game

మార్వెల్ సంస్థ నిర్మించిన ‘అవెంజర్స్.. ఎండ్ గేమ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.15,302 కోట్లను దాటేసి సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది. ఈ క్రమంలో టైటానిక్ సినిమా కలెక్షన్లను కూడా ఎండ్ గేమ్ బీట్ చేసేసింది. ఈ నేపథ్యంలో అవతార్, టైటానిక్ సినిమాల దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘అవెంజర్స్.. ఎండ్ గేమ్’పై ప్రశంసల వర్షం కురిపించారు.

మార్వెల్ సంస్థ అధినేత కెవిన్ ఫిజ్, ఇతర సిబ్బందిని ఉద్దేశించి..‘నిజమైన టైటానిక్‌ ఓడను ఓ ఐస్‌బర్గ్ ముంచేసింది. కానీ నా ‘టైటానిక్‌’ను మీ ‘అవెంజర్స్‌’ ముంచేసింది. మా నిర్మాణ సంస్థ లైట్‌స్టోర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని సిబ్బంది మీ విజయానికి సెల్యూట్‌ చేస్తున్నారు. సినీ పరిశ్రమ సజీవంగానే కాదు సరికొత్త ఎత్తుకు చేరుకుందని మీరు నిరూపించారు’ అని ట్వీట్ చేశారు.