నార్కోటిక్స్ కంట్రోలు బోర్డు సభ్యురాలిగా జగిత్ పవదీయ

SMTV Desk 2019-05-10 12:33:53  international narcotics control board member,

న్యూయార్క్: అంతర్జాతీయ నార్కోటిక్స్ కంట్రోలు బోర్డు సభ్యురాలిగా భారత సంతతికి చెందిన జగిత్ పవదీయ ఎన్నికయ్యారు. మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో 15 మంది పాల్గొన్నారని యుఎన్ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 54 మంది సభ్యులు ఓటింగ్‌కు హాజరయ్యారని, విజయానికి 28 ఓట్లు అవసరం కాగా మొదటి రౌండ్‌లోనే జగిత్ పవదీయకు 44 ఓట్లు లభించినట్లు ఆయన వివరించారు. రెండో స్థానంలో జలాల్ తౌఫిఖ్‌కు 32 ఓట్లు లభించాయని, సీసర్ తౌమస్ ఆర్‌సె రివాస్‌కు 31 ఓట్లు లభించాయని ఆయన చెప్పారు. తిరిగి ఎన్నికైన జగిత్ పవదీయ పదవీ కాలం 2025 సంవత్సరం మార్చి 1వ తేదీ వరకు ఉంటుంది. పవదీయ మాట్లాడుతూ సభ్యులు తనపై నమ్మకంతో తిరిగి ఎన్నుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.