సీఎంగా కుమారస్వామి మంచి పనులు చేస్తున్నారు : కర్ణాటక మాజీ సీఎం

SMTV Desk 2019-05-09 19:11:26  siddramayya, karnataka cm, hd kumaraswamy

సీఎం కుర్చీనే ఖాళీ లేకుంటే... నేనెలా ముఖ్యమంత్రి అవుతానన్నారు..? మాజీ సీఎం సిద్దూ. బుధవారం హుబ్బళ్ళి విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంగా కుమారస్వామి మంచి పనులు చేస్తున్నారని కితాబునిచ్చారు. కొందరు అభిమానంతో అలా అంటుంటారని ఎమ్మెల్యేలు నా పట్ల ప్రత్యేకత చూపుతున్నారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతితో కూరుకుపోయారని అందుకే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారని వారి పరిపాలనకు అదే అద్దం పట్టినట్టు అని వ్యాఖ్యానించారు.

ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగానని అవినీతికి తావు లేకుండా పాలన సాగించానన్నారు. జేడీఎస్‌ సీనియర్‌ నేత బసవరాజ్‌ హొరట్టి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి స్థానం నుంచి రమేశ్‌ జార్కిహొళిని తొలగించడంతోనే వివాదం కొనసాగుతోందనడం సరికాదన్నారు. హొరట్టి మౌనంగా ఉంటే బాగుంటుందన్నారు.