నోకియా 6.1 ప్లస్‌, 5.1 ప్లస్ ధరలు తగ్గింపు

SMTV Desk 2019-05-09 19:09:25  nokia 6.1 plus, nokia 5.1 plus

నోకియా నుంచి గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారత్‌ మార్కెట్లోకి వచ్చిన 6.1 ప్లస్‌, 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించారు. ఇప్పటివరకు నోకియా 6.1 ప్లస్ రూ.15,999 ధరకు, 5.1 ప్లస్ రూ.10,999 ధరకు ఇప్పటి వరకు లభ్యం అయ్యాయి. నోకియా 6.1 ప్లస్ 4జీబీ ర్యామ్ వేరియెంట్‌, నోకియా 5.1 ప్లస్ 3జీబీ ర్యామ్ వేరియెంట్లకు గాను లిమిటెడ్ టైమ్ ఆఫర్ కింద ధరను తగ్గించారు. రూ.1750 డిస్కౌంట్‌ను ఈ ఫోన్లకు అందిస్తున్నారు. వినియోగదారులు నోకియా ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు DEAL1750 అనే కోడ్‌ను ఇచ్చి ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇక ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ ఫోన్లపై రూ.2వేల క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. కాగా నోకియా 5.1 ప్లస్ 3జీబీ ర్యామ్ వేరియెంట్ ధర తగ్గింపుతో రూ.8849 ధరకు లభిస్తున్నది. అలాగే నోకియా 6.1 ప్లస్ 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర తగ్గింపుతో రూ.13,749 ధరకు లభిస్తున్నది.