తగ్గిన ఇంధన ధరలు

SMTV Desk 2019-05-09 19:08:36  Petrol, Deseal, Price, New delhi

గత మూడు రోజుల నుంచి నిలకడగా ఉన్న దేశీ ఇంధన ధరలు నేడు( గురువారం) కాస్త తగ్గుముఖం పట్టాయి. పెట్రోలు ధరలు 15 -17 పైసలు తగ్గగా.. డీజిల్ ధరలు 7- 10 మేర తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు 16 పైసలు, డీజిల్ 10 పైసల మేర తగ్గడంతో.. అక్కడ లీటర్ పెట్రోలు ధర రూ.72.84 వద్ద, డీజిల్ ధర 66.56 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు 16 పైసలు, డీజిల్ 10 పైసలు తగ్గడంతో.. లీటర్ పెట్రోలు ధర రూ.78.44 వద్ద, డీజిల్ ధర 69.74 వద్ద కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. లీటర్ పెట్రోలు ధర 17 పైసలు, లీటర్ డీజిల్ ధర 7 పైసల మేర తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.77.26 వద్ద, డీజిల్ ధర రూ.72.39 వద్ద కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోలు ధర రూ.76.96 వద్ద, డీజిల్ ధర రూ.71.74 వద్ద కొనసాగుతున్నాయి. ఇక విజయవాడలో పెట్రోలు ధర రూ.76.61 వద్ద, డీజిల్ ధర రూ.71.41 వద్ద కొనసాగుతున్నాయి.